LATEST UPDATES

Study Material for competitive exams

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

TEACHERS బదిలీలు సమచార౦

Recruitment Updates

Career‌ portal‌ started forAP students, Register with your details

Posted by VIDYAVARADHI on Monday, 14 September 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

 Career‌ portal‌ started forAP students, Register with your details

విద్యార్థుల కోసం ఏపీ కెరీర్‌ పోర్టల్‌ ప్రారంభం, ప్రతి విద్యార్థి వివరాలు నమోదు చేసుకోండి..!

విద్య, ఉద్యోగ కల్పన, కోర్సుల వివరాల్ని తెలిపేందుకు apcareerportal.in ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా.. విద్యార్థులకు విద్య, ఉద్యోగ కల్పన, కోర్సుల వివరాల్ని తెలిపేందుకు https://apcareerportal.in/ ను అందుబాటులోకి తెచ్చారు. ఏపీఎస్‌సీఈఆర్‌టీ, యూనిసెఫ్, ఆస్మాన్‌ ఫౌండేషన్‌ సహకారంతో దీనిని అమలుచేస్తున్నారు.

ఏపీలో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న సెకెండరీ స్థాయి విద్యార్థుల చదువులతో పాటు భవిష్యత్‌లో ఎంచుకోబోయే ఉపాధి కోర్సులను, వాటి ద్వారా పొందబోయే ఉద్యోగాల వివరాలను తెలియజేస్తున్నారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారు.

వివిధ రకాల నోటిఫికేషన్లు, ఫీజులు, పరీక్షలు, కోర్సుల వివరాలు, చివరి తేదీ, వాటికయ్యే ఖర్చు, జీతం, ఉపకార వేతనాలు తదితర వివరాలు https://apcareerportal.in/‌ ‌లో ఉంటాయి.

విద్యార్థులు ఇలా చేయాలి:

పాస్‌వర్డ్‌గా 123456 ఉంటుంది. అది ఎంటర్ చెయ్యాలి. 9 భాషల్లో మీ వివరాల్ని నమోదు చేసుకోవచ్చు.

విద్యార్థి తనకు నచ్చిన భాషను ఎంచుకొని లాగిన్‌ అవ్వాలి. డాష్‌కోడ్‌లో... మై కెరీర్‌లో... డెమోలో ప్రొఫైల్‌ నింపాలి.

విద్యార్థి చదువు, కుటుంబ వివరాలు, ఫోన్‌ నంబర్‌తో సహా ఎంటర్‌ చెయ్యాలి.

వివరాలన్నీ ఇస్తే.. నమోదు చేయడం పూర్తవుతుంది.

ఏయే కోర్సులు ఉంటాయి:

550 క్లస్టర్లతో ఉన్న 672 రకాల కోర్సులు, ఉద్యోగాలు, ఉపాధి వివరాలు ఇందులో ఉంటాయి. వ్యవసాయం, అందం, ఆరోగ్యం, వృత్తి నైపుణ్యం, 64 కళలకు సంబంధించిన కోర్సులు, బయోలాజికల్, ఆర్టిఫీషియల్, ఎనర్జీ, మెరైన్, సోలార్‌ రబ్బర్ వంటి ఇంజినీరింగ్‌ కోర్సుల వివరాలుంటాయి. ఒక్కో కోర్సుకు అయ్యే ఖర్చు, కోర్సు తర్వాత కెరీర్, జీతాలు వంటి వివరాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కాలేజీల నుంచి స్కాలర్ షిప్‌లు పొందే వీలుంది. (సంతూర్, గ్లో అండ్‌ లవ్లీ, రమణ్‌కుమార్‌ ముంజల్, ఆర్‌కేఎం ఫౌండేషన్‌ వంటి సంస్థలు ఇచ్చే స్కాలర్ షిప్‌ల వివరాలు https://apcareerportal.in/ ‌లో ఉంటాయి. వాటిని మొత్తం చెక్ చేసుకొని విద్యార్థులు తమ కెరీర్ డిసైడ్ చేసుకోవచ్చు.

 WEBSITE https://apcareerportal.in/

Career‌ portal‌
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: September 14, 2020

1 comments: