How to Apply Scholarships @ E PASS website
ఉపకార వేతనాలకై ఈ-పాస్ నందు రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం :-
2021-22 విద్యాసంవత్సరంలో వివిధ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో విద్యనభ్యసిస్తున్న షెడ్యూల్డు కులాల SC,ST,BC,MINORITY and Disable welfare విద్యార్థులలోని అర్హత కలిగిన విద్యార్థులు ( ఫ్రెష్ మరియు రెనెవల్) ఉపకార వేతనాలు ( ఫీజు మరియు మెయింటెనెన్స్ చార్జీలు) పొందేందుకు తమ అప్లికేషన్ (తమ వివరాలు) ను ఈ-పాస్ వెబ్సైట్ "http://telanganaepass.cgg.gov.in" నందు అప్‌లోడ్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఈ నెల 24 వ తేదీ (సెప్టెంబర్ 24) నుంచి వచ్చే నెల 24 వ తేదీ (అక్టోబర్ 24) వరకు ఈ - పాస్ వెబ‌్సైట్ అప్లికేషన్‌లను అప్లోడ్ చేసుకునేందుకు తెరిచి / అందుబాటులో ఉంటుంది.
కాబట్టి షెడ్యూల్డు కులాల SC,ST,BC,MINORITY and Disable welfare కు చెందిన కళాశాల విద్యార్థులు అందరూ (అర్హులైనవారు) ఈ అవకాశం వినియోగించుకోవాలనీ, సదరు కళాశాలల ప్రిన్సిపాల్స్ తమ విద్యార్థులకు ఇట్టి సమాచారం అందజేసి వారిచే ఈ-పాస్ వెబ్సైట్ నందు ఉపకార వేతనాలకై రిజిస్ట్రేషన్ చేసుకావాలి.
ప్రి- మెట్రిక్ స్కాలర్షిప్ అవకాశం
5 నుండి 10వ, తరగతి చదువుతున్న
SC,ST & BC విద్యార్థులకు
ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్స్ కొరకు తెలంగాణ e pass వెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
👉 Scholarship apply చేయడానికి విద్యార్థి యొక్క
1.ఒక పాస్ ఫోటో
2.క్యాస్ట్ సర్టిఫికెట్
3.ఇన్కమ్ సర్టిఫికెట్
4.రేషన్ కార్డ్
5.విద్యార్థి పేరు మీద బ్యాంక్ ఎకౌంట్ నెంబర్
6.విద్యార్థి యొక్క ఆధార్ కార్డు
ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పొందడానికి అర్హతలు
- విద్యార్థుల ఇన్కమ్ సర్టిఫికెట్ ఏప్రిల్-2020 తర్వాత తీసినది ఉండాలి.
- ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఆదాయం రెండు లక్షల లోపు ఉండాలి.
- బిసి మరియు ఈ బీసీ విద్యార్థుల ఆదాయం లక్షన్నర లోపు ఉండాలి.
- డిసేబుల్ విద్యార్థుల ఆదాయం లక్ష కంటే ఎక్కువ ఉండవచ్చు.
- స్కాలర్ షిప్ అప్లై చేస్తున్న విద్యార్థి హాజరు శాతం తప్పనిసరిగా 75 శాతం ఉండాలి.
- విద్యార్థులకు పది నెలలకు స్కాలర్షిప్ మంజూరు చేయబడుతుంది.
- నెలకు వంద రూపాయల చొప్పున వెయ్యి రూపాయలు మంజూరు చేయబడతాయి.
- ఎస్సీ ఎస్టీ బాయ్స్ కు 100 రూపాయలు నెలకు,
- ఎస్సీ ఎస్టీ గర్ల్స్ అయితే నెలకు నూట యాభై రూపాయలు మంజూరు చేయబడుతుంది.
- 9,10వ,తరగతి విద్యార్ధులకు నెలకు 300 రూపాయల చొప్పున,10 నెలలకు 3000రూపాయలు మరియు అదనంగా ₹1000 రీడింగ్ సామగ్రి కొనుగోలుకు మంజూరు చేయబడుతాయి.
మీ స్కూల్ / కాలేజీలో సబ్మిట్ చేయవలసినవి
- ప్రింటెడ్ అప్లికేషన్
- ఆధార్ కార్డు జిరాక్స్
- ఆదాయం సర్టిఫికెట్ జిరాక్స్
- స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్
- బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్
- కులం సర్టిఫికేట్ జిరాక్స్
మొదటగా కింద ఇచ్చినటువంటి లింకు పైన క్లిక్ చేయండి మీరు అఫీషియల్ వెబ్ సైట్ కి వెళ్తారు
ఆ పేజీలో క్రింది కి వెళ్లండి అక్కడ pre మెట్రిక్ బటన్ కనబడుతుంది దాని పైన క్లిక్ చేయండి
తర్వాత పేజీ లో రిజిస్ట్రేషన్ అని కనపడుతుంది దాని పైన క్లిక్ చేసి మీ యొక్క వివరాలను సబ్మిట్ చేయండిస్కాన్ చేయవలసినవి
- బ్యాంక్ పాస్ బుక్ (ఇది 100 kbకంటే తక్కువ సైజులో అప్లోడ్ చేయండి)
- ఆధార్ కార్డ్ (ఇది 100 kbకంటే తక్కువ సైజులో అప్లోడ్ చేయండి)
- ఫోటో(ఇది 50 kbకంటే తక్కువ సైజులో అప్లోడ్ చేయండి)
E PASS website:https://telanganaepass.cgg.gov.in/
0 comments:
Post a Comment