Teachers Rationalisation Norms Released Vide GO MS No 25 dated 12.08.2021
పాఠశాలల హేతుబద్దీకరణ జీ. వో ముఖ్యాంశాలు
U-DISE (2019-20) ఆధారంగా పాఠశాల విద్యార్థుల సంఖ్య & ఉపాధ్యాయుల నిష్పత్తి నిర్ధారణ. తదనుగుణంగా మిగులు పోస్టులు, అవసరమగు టీచర్ పోస్టుల నిర్దారణ.
సాధారణ బదిలీ కౌన్సెలింగ్ మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు.
U-DISE 20-21 ఆధారంగా పోస్టుల హేతుబద్దీకరణని సక్రమంగా నిర్వహించడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ ఛైర్మన్ గా, డీఈవో సెక్రటరీ గా ఏర్పాటు కానున్న కమిటీ.
డీఈవో పోస్టుల హేతుబద్దీకరణ ఉత్తర్వుల్లో ఏవైనా సమస్యలుంటే, DSE Hyd కు అప్పీలు అవకాశం. ఈ అప్పీలు అవకాశం కేవలం ఉత్తర్వులు అందుకున్న 10 రోజుల లోపు మాత్రమే .
ఈ హేతుబద్దీకరణలో ఏదేని పోస్ట్ సృష్టి గాని, రద్దు గాని జరగకుండా చర్యలు.
ప్రతి పాఠశాలలో కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండాలనే నిబంధన.
ఒకే కాంపౌండ్ లో ఉన్న స్కూళ్ల విలీనానికి చర్యలు.
హేతుబద్దీకరణ పోస్టులన్నీ యాజమాన్యం వారీగా గుర్తింపు.
హేతుబద్దీకరణ బదిలీలో భాగంగా పాఠశాలలో సీనియారిటీ ఇన్ సర్వీస్ ఆధారంగా జూనియర్* అయిన ఉపాధ్యాయుడు మిగులు ఉపాధ్యాయులు గా పరిగణింపబడతారు. ఒకవేళ సీనియర్ ఉపాధ్యాయులు సుముఖత వ్యక్తం చేస్తే.. అవకాశం వారికి ఇవ్వబడుతుంది.
Director of School Education హేతుబద్దీకరణకి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తారు.
Click to download U-DISE 2019-20 School Report card data for rationalisation post calculations...
TS TEACHERS TRANSFERS CALCULATOR
🗓️ Cutoff Date: 31.07.2023
(expected)
0 comments:
Post a Comment