Mobile ద్వారా పెన్షనర్లు life certificate సమర్పించు విధానము
- ప్రతి సంవత్సరము పెన్షనర్లు తాము బతికే ఉన్నట్లు November 1 నుండి February 28 లోగా ఫోటోతో నిర్ణీత దరఖాస్తు ఫారంలో సంబంధిత ట్రెజరీ అధికారికి సమర్పించాలి. దీనిలో PPO NUMBER, ఆధారిత నంబర్, పెన్షన్ తో లింక్ అయిన ఆధార్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి.
- అయితే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెన్షనర్ల life certificate సమర్పించడానికి ప్రభుత్వము ఆప్ ను రూపొందించింది. దీన్ని వినియోగించుటకు ఆండ్రాయిడ్/ఆపిల్ ఫోన్ లో T App Folio ను download చేసికోవాలి.
- Application download అయిన తర్వాత మొదటి పేజి లో pensioner life authentication అనే ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే Registration, Registration status check, Authentication, Reciept అనే భాగాలు కనిపిస్తాయి. మొదట Registration ను టచ్ చేస్తే పెన్షన్ అకౌంట్ వివరాలు (పెన్షన్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నంబరు, PPO id, phone నంబర్ ) పూర్తి చేసి proceed కావాలి.
- తర్వాత ఫోటో కావాలని అడుగుతుంది. Cell phone తో selfie తీసి submit చేస్తే వివరాలు పూర్తవుతాయి. 1 లేదా 2 రోజుల్లో మనం సమర్పించిన వివరాలు ఆమోదించబడుతాయి. ఆ విషయాన్ని app లోని authentication లో చూస్తే విషయం తెలుస్తుంది. ఆమోదించబడితే ఆ సంవత్సరానికి life certificate సమర్పించే పని పూర్తవుతుంది. ట్రెజరీ కార్యాలయానికి వెళ్ళకుండ ఈ ఆప్ ద్వారా life certificate సమర్పించవచ్చు.
0 comments:
Post a Comment